అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు లంగ్ క్యాన్సర్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబయిలోని నానవతి ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం సంజయ్ అమెరికా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సంజయ్ దత్ ఆరోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ట్విటర్ ద్వారా స్పందించారు.
సంజయ్ దత్.. ఈ సమయంలో మీరు ఫైటర్‌లా పోరాడాలి. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు మీరు మరింత దృఢంగా ఉండాలి. మీరు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు. గతంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారినపడి మెరుగైన చికిత్స తీసుకొని కోలుకున్న విషయం తెలిసిందే.
