మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ అవును అనేశాం. రోకా వేడుక అంటూ ట్వీట్ చేశాడు టీం ఇండియా యంగ్ క్రికెటర్ చాహల్. అవును చాహల్ పెళ్లి ఫిక్స్ అయింది. లాక్ డౌన్ సమయంలోనే ఇదంతా జరిగిపోయింది. హఠాత్తుగా పెళ్లికబురు చెప్తూ అభిమానులకు క్రికెటర్ లకు షాక్ ఇచ్చాడు చాహల్. చాహల్ మనసు దోచేసిన ఆ అందమైన అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ. ఆమె కుటుంబ, వ్యక్తిగత వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరిని ఒకరు ఇష్టపడటం, ఇరు కుటుంబాలు ఒప్పుకోటం, రోకా వేడుక సైతం జరిగిపోటం అన్ని జరిగిపోయాయి. అంతే కాదు వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు.
కొత్త జంటకు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ కపూర్, ఆకాశ్ చోప్రా, కునాల్ కపూర్, కేఎల్ రాహుల్, హిమాన్షి ఖురానా, గౌరవ్ కపూర్, బౌలింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనీ వ్యాట్, రోహిత్ సతీమణి రితికా సజ్దె, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, మన్‌దీప్ సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు.