మైదానంలో ఎదురులేని మొనగాళ్లు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్ప గల సమర్థులు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ… ఇండియా సత్తా చాటడంలో కీలకంగా ఉన్న క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్, కోహ్లిలు ఇప్పుడు కరోనాను ఇండియా బార్డర్ అవతలికి పంపేందుకు పనిచేయబోతున్నారు.
అవును.. భారత్ లో క్రికెట్ ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 80 ఏళ్ల ముసలి వారి దగ్గర నుండి ఇప్పుడిప్పుడే ఆటలాడుతున్న అందరికీ క్రికెట్ సుపరిచితమే. అందులోనూ సచిన్, గంగూలీ, కోహ్లిలు మరీ ఎక్కువ. అందుకే ఇప్పుడు వీరి ద్వారా ప్రజలను కరోనా వైరస్ నిర్మూలనలో ప్రజలను చైతన్య పర్చాలని కేంద్రం నిర్ణయించింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ వీరితో భేటీ కాబోతున్నారు. కరోనా కట్టడికి వీరు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్నారు. క్రికెటర్లు మాత్రమే కాదు బాలీవుడ్ నటీ, నటులతో పాటు పలువురు ప్రముఖులను కరోనా పై పోరులో భాగస్వామ్యం చేయబోతుంది కేంద్రం.