గ్లోబల్ ఆస్పత్రి ఫౌండర్ చైర్మన్ రవీంద్రనాథ్ ఇంట్లోకి ప్రవేశించి బెదిరించిన 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గత కొంత కాలంగా డాక్టర్ రవీంద్రనాథ్.. ఆయన భార్యతో పాటు అల్లుడు ఇతర కుటుంబ సభ్యులతో ఆస్తి పంపకాలు సంబంధించిన వివాదం న్యాయస్థానాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈనెల 2న తన ఇంట్లోకి ఉమామహేశ్వరరావు, రేవతి, పద్మిని ,వనజ , లక్ష్మీ శైలజ, ప్రత్యూష, శోభన్ బాబు, మధుబాబు.. లతో సహా 12 మంది ప్రవేశించి భద్రతా సిబ్బందిని బెదిరించారని పేర్కొన్నారు.
తన అల్లుడు సూర్య తేజ… పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐ.పి.సి. సెక్షన్ 148, 290, 448, 341 రెడ్ విత్ 149 కింద కేసు నమోదు చేశారు.