పోర్చుగ్రీసు ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్గోకు ఖరీదైన కార్లంటే పిచ్చి. అందుకే ఖరీదైన కార్లను ఆయన కలెక్ట్ చేస్తూ వుంటాడు. ఇప్పటికే ఆయన దగ్గర ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి.
రెండేండ్ల కిత్రం ఆయన బుగాటి వేరాన్ అనే సూపర్ కారును ఆయన కొనుగోలు చేశారు. దాని విలువ దాదాపు రూ. 16 కోట్లు వరకు ఉంటుంది. తాజాగా ఆ కారు ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లోని మజోర్కాలో ఓ ఇంట్లోకి కారు దూసుకు పోయింది.
ప్రమాద సమయంలో కారులో రొనాల్డో లేరని అధికారులు చెబుతున్నారు. కారును రోనాల్లో డ్రైవర్ ఒకరు నడిపినట్టు అధికారులు తెలిపారు. కారు వేగంగా వెళుతుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకు పోయినట్టు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్ పెద్దగా గాయపడలేదని, కానీ కారు ముందు భాగం డ్యామేజ్ అయినట్టు వివరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కారు రిపేర్ కు భారీగానే ఖర్చు కానున్నట్టు తెలుస్తోంది.