• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ట్విట్టర్ హీరో.. మస్క్ మజా!

ట్విట్టర్ హీరో.. మస్క్ మజా!

Last Updated: January 16, 2022 at 7:50 am

ట్విట్టర్ మంత్రి కేటీఆర్.. మళ్లీ తన ట్వీట్ తో సంచలనం సృష్టిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రైతుల అంశంపై ఎవరితోనైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన ఆయన.. తీరా తొలివెలుగు స్టూడియో అందుకు వేదిక సిద్ధం చేయడం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చకు తొలివెలుగు స్టూడియోకు రావడం.. కేటీఆర్ మొహం చాటేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ట్విట్టర్ ఛాలెంజ్ సత్తా కూడా తెలిసింది.

ఓవైపు రైతుల సమస్యలు ఎక్కడివక్కడే ఉండగా.. అన్నదాతలు ఆత్మహత్యలు అందరిలో కలవరం రేకెత్తిస్తుండగానే, కేటీఆర్ సార్ మళ్లీ ట్వీట్ చేశారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్టు.. సన్నకారు, చిన్నకారు రైతుల ప్రాణాలు కాపాడలేని సారు.. కారు.. సర్కార్ లోని సదరు ఐటీ మంత్రి గారు.. టెస్లా అనే పెద్ద ‘కారు’కు స్కెచ్ వేశారు.

అసలు.. కేంద్రంతో, ఇతర రాష్ట్రాలలో కాని కార్యాలు మా తెలంగాణలో చకచకా అవుతాయని, మీ కార్ల కంపెనీ తెలంగాణలో నెలకొల్పాలని ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ కు ఆహ్వానం అందించేశారు. దీనికి మస్క్ కూడా స్పందించి, కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని బదులిచ్చారు. గత రెండేళ్లుగా టెస్లా కార్లను ఇండియాకి తెస్తామంటూ ఎలాన్‌ మస్క్‌ ప్రకటిస్తున్నారు. అయితే దిగుమతి సుంకం తగ్గించాలంటూ మెలిక పెట్టారు. ఇండియాలో కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పన్ను రాయితీలపై సానుకూలంగా స్పందిస్తామని కేంద్రం బదులిచ్చింది. దీనిపై ఇటు టెస్లా, అటు కేంద్రం మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India

Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana

Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr

— KTR (@KTRTRS) January 14, 2022

ఇదంతా ఒక ఎత్తయితే.. అన్నం పెట్టే రైతన్న చస్తుంటే నోరు మెదపని మన సెలెబ్రిటీలు.. వెంటనే మస్క్ కు కేటీఆర్ చేసిన ట్వీట్ ను కోట్ చేస్తూ.. ఆహా ఓహో అని ఎత్తేయడం. ఫిలిం డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఓ అడుగు ముందుకేసి.. తెలంగాణకు టెస్లా రావటం తమకు అత్యంత ఇష్టమైన విషయం అని అన్నాడు. అంతేకాదు.. హైదరాబాద్ దేశంలోనే లీడింగ్ బిజినెస్ హబ్ అనీ, మస్క్ ను ఆహ్వానించిన కేటీఆర్ గొప్ప నాయకుడని ప్రశంసల్లో ముంచెత్తాడు.

Dear @elonmusk we would love to have @Tesla in Telangana ..as we have the best infrastructure and the leading business hub of India @KTRTRS https://t.co/MWa4L2sl2k

— Gopichandh Malineni (@megopichand) January 15, 2022

మరో డైరెక్టర్ మెహర్ రమేష్ టెస్లాకు స్వాగతం.. మీకు తెలంగాణలో అత్యుత్తమ భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నాడు. అలాగే కేటీఆర్ ను ఆకాశానికెత్తేశాడు. ఉత్తమ మంత్రి, అత్యుత్తమ అడ్మినిస్ట్రేషన్ ఉందంటూ రాసుకొచ్చాడు.

Welcome to #Tesla 🚘 @elonmusk sir you have best land& infrastructure in Telangana🙏🏻of course best Minister & Administration @KTRTRS https://t.co/fmJYszN4PP

— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) January 15, 2022

హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. హైదరాబాద్ కు రండి. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది అంటూ మస్క్ ను ట్యాగ్ చేశాడు.

.@elonmusk –

Come to Hyderabad – India!!!
It will be epic to have you 🤍

The Government here in Telangana is terrific too..

— Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022

ఇంకో హీరో నిఖిల్.. వాట్ ఏ పర్సన్ అంటూ లవ్ సింబల్ తో కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేశాడు. టెస్లాను తెలంగాణకు తీసుకొద్దాం అన్నా అంటూ కేటీఆర్, మస్క్ ను ట్యాగ్ చేశాడు.

What a Person ❤ Lets Get Tesla to Telangana anna … @KTRTRS @elonmusk @TelanganaCMO https://t.co/E5yc1QYW5e

— Nikhil Siddhartha (@actor_Nikhil) January 15, 2022

టెస్లా కారు అంటే తనకు ఎంతో ఇష్టమని నటి జెనీలియా ట్వీట్ చేసింది. వస్తుందని ఆశిస్తున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ ను రీ ట్వీట్ చేసింది.

Love this car so so much @elonmusk
Feels like hope is around the corner @KTRTRS https://t.co/Ee5qVUz4FW

— Genelia Deshmukh (@geneliad) January 15, 2022

Advertisements

ఇంకో ప్రముఖుడు అయితే.. టెస్లా రేసులో హైదరాబాద్‌ ఇప్పుడే బెంగళూరును అధిగమించింది. ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన కేటీఆర్ కే పూర్తి మార్కులు అని పోస్ట్ పెట్టాడు. అయినా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వారి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉండదు గానీ.. బడాబాబులు తిరిగే కార్లపై మాత్రం స్పందిస్తారా? అంటూ సెలెబ్రిటీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

వ‌క్తి చేసిన తప్పు.. వ్య‌వ‌స్థ‌కే ముప్పు..!

బ‌ద్రీనాథ్ యాత్ర‌కు ఆటంకం..రోడ్డు పై ప‌డ్డ కొండ చ‌రియ‌లు

కేసీఆర్ స‌ర్కార్ కు పుట్టగ‌తులుండవ్!

మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన హ‌ర్మ‌న్…

మోడీ తెలంగాణ షెడ్యూల్ ఇదే!

ఆయన ఎంత నేర్పరి అయినా కొన్ని విషయాలు దాచలేరు

రెబెల్స్ కు భద్రత పెంపు… కేంద్రం కీలక నిర్ణయం…!

ఎమర్జెన్సీపై మోడీ హాట్ కామెంట్స్

న్యాయస్థానం వ్యాఖ్య‌లే.. సేత‌ల్వాద్ అరెస్ట్ కు కార‌ణం..!

సార్..మీరేనా..? గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నాం…

ఇవి ఉప‌యోగిస్తే తెల్ల‌జుట్టు ఉండ‌దు…

వీటిని తింటే చ‌క్కెర స్థాయి అదుపులో ఉంచొచ్చు..

ఫిల్మ్ నగర్

సార్..మీరేనా..? గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నాం...

సార్..మీరేనా..? గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నాం…

పంచాంగం ప్ర‌కార‌మే ఇస్రోప్ర‌యోగాలు.. హీరో మాధ‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.!

పంచాంగం ప్ర‌కార‌మే ఇస్రోప్ర‌యోగాలు.. హీరో మాధ‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.!

జోరుగా విక్రాంత్ రోణ మూవీ ప్ర‌మోష‌న్స్.. గైర్హాజ‌రైన జాక్వెలిన్..!

జోరుగా విక్రాంత్ రోణ మూవీ ప్ర‌మోష‌న్స్.. గైర్హాజ‌రైన జాక్వెలిన్..!

డీజేటిల్లు సీక్వెల్.. నిర్మాత కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

డీజేటిల్లు సీక్వెల్.. నిర్మాత కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

జుట్టు మీ మాట వినాలా..? ఇలా చేయండంటున్నారు ఈ భామ‌లు

జుట్టు మీ మాట వినాలా..? ఇలా చేయండంటున్నారు ఈ భామ‌లు

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

విడుదల వాయిదా... రీజన్ చెప్పిన దిల్ రాజు

విడుదల వాయిదా… రీజన్ చెప్పిన దిల్ రాజు

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)