హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మొసలి కలకలం రేపింది. రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసీ లో ఈ మొసలి కలకలం సృష్టించింది. గండిపేట , హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా మూసీలోకి వరద నీరు వచ్చి చేరింది.
అయితే ఈ వరద నీటిలోనే మొసలి కొట్టుకు వచ్చింది. వరద నీటిలో మొసలి కొట్టుకురవటంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.