డొల్ల కంపెనీలతో విదేశాలకు సొమ్ము తరలింపు కేసులో ఆస్తుల అటాచ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. కాకా గ్రూప్, శశిగోయల్, ప్రగతి ప్రింట్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రూ.18.67 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.
విశాఖ హవాలా కేసు నిందితుడు వడ్డీ మహేష్ పై పోలీసుల కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ… సుమారు 40 డొల్ల కంపెనీల ద్వారా అతను నిధులు మళ్లించినట్లు పేర్కొంది. ఆయా కంపెనీలతో చైనా, హాంకాంగ్, సింగపూర్ కు డబ్బు తరలించినట్లు తెలిపింది.
విదేశాలకు అక్రమంగా నగదు తరలింపులో బీకే గోయెల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు వివరించింది ఈడీ.