కరోనా వైరస్ ఇప్పుడు మరోసారి తన ప్రభావం గట్టిగా చూపిస్తున్న నేపధ్యంలో ఏం జరుగుతుంది ఏంటీ అనేది కాస్త ఆందోళన కలిగిస్తుంది. అమెరికా సహా చాలా దేశాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన దేశంలో కూడా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ అనే మాట వినపడుతుంది. ఇక కరోనా మందుల విషయంలో పరిశోధనలు గట్టిగా జరుగుతున్నాయి. మానవ శరీరంలోకి కరోనా వెళ్ళకుండా ఉండటానికి ఏయే మార్గాలు ఉన్నాయనే దాని మీద వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారు.
ఈ సమయంలో కరోనా పేరుతో కోట్లాది రూపాయలు ఆస్పత్రులకు ఖర్చు చేస్తున్నారు ప్రజలు. లక్షలు లక్షలు పోయి కోట్లకు కోట్లు ఖర్చు చేసే పరిస్థితి వచ్చింది. ప్రాణాలు నిలుపుకోవడానికి వైద్యులు చెప్పిన మాటలు విని భారీగా ఖర్చు చేస్తూ ఆరిపోతున్నారు. తాజాగా కరోనా నుంచి బయట పడటానికి ఏకంగా 50 ఎకరాలు అమ్మింది ఒక రైతు కుటుంబం. రూపాయి కాదు రెండు కాదు ఏకంగా 8 కోట్ల రూపాయలను ఖర్చు చేసారు.
అయినా సరే ప్రాణం మాత్రం నిలబడలేదు. మధ్యప్రదేశ్ కు చెందిన రైతు ధర్మ జయ్ కు గత ఏడాది మే లో కరోనా సోకగా ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. ఆ తర్వాత బంధువులు అతన్ని చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసారు. రోజుకు అప్పటి నుంచి మూడు లక్షలకు పైగా ఖర్చు చేసారు. 8 నెలల నుంచి అలాగే చికిత్స అందించారు. లండన్ డాక్టర్ లు కూడా వచ్చారు. అయినా సరే ప్రాణాలు నిలవక ప్రాణాలు విడిచారు.