సినిమాకు రిచ్ లుక్ కోసం పెద్ద హీరోల సినిమాలో ఖర్చు ఎంతుంటుందో అందరికీ తెలుసు. కానీ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలో సూపర్ హిట్ పాట సామజవరగమన పాట వీడియో చిత్రీకరణకే ఆరు కోట్లు ఖర్చుపెట్టిందట చిత్ర యూనిట్.
ఈ పాటకు జనంలో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే వీడియో కూడా అద్భుతంగా రావాలనుకొని ఫారిన్ టూర్ వేశారు. ఇటలీలో ఈ షూటింగ్ జరగ్గా… మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను కూడా తీసుకెళ్లారట. ఇక చిత్ర బృందం సరేసరి. వీరందరికి అక్కడ కోటి రూపాయలు కాగా, కేవలం సాంగ్ కోసమే 5కోట్ల వరకు ఖర్చుపెట్టారట. అయితే అంత ఖర్చు చేసినా ఇంకాస్త పార్ట్ మళ్లీ హైదరాబాద్‌లోనే చేయాల్సి వచ్చిందట.
వామ్మో… సమాధుల దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
మొత్తానికి ఎలాగైనా బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఖర్చుకు మాత్రం వెనకాడ లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.