ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామన్న అమెరికా ప్రకటనపై ఉత్తరకొరియా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అగ్రరాజ్యం అమెరికా తన ప్రకటన ద్వారా రెడ్ లైన్‌ను దాటుతోందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఫైర్ అయ్యారు.
ప్రాక్సీ యుద్ధం ద్వారా అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకోంటోందని ఆమె మండిపడ్డారు. అమెరికా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విషయంలో రష్యాకు తాము అండగా వుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.
ఉక్రెయిన్ కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు పంపుతామని ఇటీవల అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ కు 30ఏ1 అబ్రామ్స్ ట్యాంకులు పంపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. మరోవైపు ఉక్రెయిన్ కు జర్మనీ కూడా అండగా నిలిచింది.
ఈ క్రమంలో ఉత్తర కొరియా స్పందించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అగ్రరాజ్యాలు యుద్ధ ట్యాంకులు పంపితే యుద్ధం రష్యావైపు ఉత్తరకొరియా నిలవనుంది. దీంతో యుద్దం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.