శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్ మ్యాప్ ను మెట్రో ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. మెట్రో లైన్ వెళ్లే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు ఉన్న భాగం ఇంజినీరింగ్ పరంగా అతి క్లిష్టమైందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అలాగే పలు సమస్యలున్నాయని పేర్కొన్నారు.
అయితే మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రూట్ రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు ఉన్న భాగం ఇంజినీరింగ్ పరంగా అతి క్లిష్టమైంది. ఇక్కడ సాంకేతిక సవాళ్లను ఎదుర్కోక తప్పేట్టుగా లేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
అందుకే ఉత్తమమైన ఇంజినీరింగ్ పరిష్కారాలను సూచించేందుకు తనిఖీలు నిర్వహించామన్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిందని.. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం ఒక పెద్ద సవాల్ తో కూడుకున్న విషయంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కింది నుంచి అండర్ పాస్ వే.. మధ్యలో రోటరీ.. ఆ పైన ఫ్లై ఓవర్ ఒక దాని మీద ఒకటి ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ అడ్డంకిని దాటేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్ ని… అక్కడే నిర్మించేలా పరిశీలించాలని వెల్లడించారు. అయితే ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలన్నారు. ఈ మెట్రో లైన్ వెళ్లే ఎయిర్ పోర్ట్ మెట్రో పిల్లర్ లను ఫ్లైఓవర్ పిల్లర్ కు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని మెట్రో ఎండీ తెలిపారు.