మావోయిస్టులకు బందీగా చిక్కిన కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా తిరిగివచ్చారు. సుకుమా జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలోని తెర్రం పీఎస్ పరిధిలో ఆయన్ను వదిలిపెట్టారు. అక్కడినుంచి బీజాపూర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపు క్షేమంగా చేరుకున్నారు రాకేశ్వర్ సింగ్. రాగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టెర్రం అడవుల్లో ఐదురోజుల క్రితం మావోయిస్టుల పక్కాగా స్కెచ్ వేసి మరీ జవాన్లపై దాడిచేశారు. ఈ దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. రాకేశ్వర్‌సింగ్ మావోయిస్టులకు బందీగా చిక్కాడు. ఐదు రోజులుగా వారి చెరలోనే ఉన్నాడు. మధ్యవర్తులను పంపిస్తేనే అతన్ని పంపుతామని తొలుత మావోలు ఓ లేఖ విడుదల చేశారు. కానీ ఆయన్ను విడిచిపెట్టాలని ప్రభుత్వం, ఆయన కుటుంబం నుంచే కాక.. వివిధ సంఘాల నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో..బేషరతుగా మావోయిస్టులు రాకేశ్వర్‌సింగ్‌ను వదిలిపెట్టారు.
Chhattisgarh: CoBRA jawan Rakeshwar Singh Manhas brought to CRPF camp, Bijapur after he was released by Naxals pic.twitter.com/L1FKSCtVnb
— ANI (@ANI) April 8, 2021