శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పింది. దీనిపై మహారాష్ట్ర మంత్రి, ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం పారిపోయిన రెబెల్ ఎమ్మెల్యేలకు బదులు కశ్మీర్ పండిట్లకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించి ఉంటే బాగుండేదన్నారు.
ముంబైలోని శాంతాక్రూజ్‌లోని కలినాలో శివసేన కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. శివసేన నుంచి కేవలం పిరికి వాళ్లు మాత్రమే దూరంగా పారిపోయారని పేర్కొన్నారు. వారు ఎంత ప్రయత్నించినా పార్టీ గుర్తును, శివసైనికుల ప్రేమను పొందలేరని చెప్పారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే వారు వెంటనే వాళ్ల పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్లకు వ్యతిరేకంగా తాము పోటీ చేస్తామని అన్నారు. దమ్ముంటే తమపై గెలిచి చూపాలని వారికి సవాల్ ఆయన సవావల్ విసిరారు.
మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెబెల్ నేతలకు భద్రతను కేంద్రం పెంచింది. 15మంది రెబెల్స్ కు వై ప్లస్ కేటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. ఈ మేరకు వారికి భద్రత కల్పించాలని సీఆర్‌పీఎఫ్ అధికారులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేసింది.