దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నాయన్న కారణంగా చమురు సంస్థలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఫలితంగా ఈ ధరలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఆదివారం 28 పైసలు పెరిగి.. రూ.83.41 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్కు 29 పైసలు పెరిగి.. రూ.73.62 వద్ద ఉంది. హైదరాబాద్ లో తాజా పెట్రోల్ ధర లీటరుకు 86.71, డీజీల్ 80.28రూపాయలకు చేరింది. నవంబర్ 20 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచటం ఇది 14వ సారి.
ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.