రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం ఆది సాయికుమార్ స్టయిల్. గతేడాది వరుసగా సినిమాలు రిలీజ్ చేసిన ఈ హీరో.. ఈ ఏడాది కూడా అదే ఊపు కొనసాగించబోతున్నాడు. ఇందులో భాగంగా సీఎస్ఐ సనాతన్ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు.
హీరో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్(సీఎస్ఐ) ఆఫీసర్ గా, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “సీఎస్ఐ సనాతన్”. మార్చి 10న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది ఇంటెన్స్ పర్మార్మెన్స్ తో సినిమా ఉండబోతోంది.
ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించగా.. చాగంటి ప్రొడక్షన్ బ్యానర్ లో అజయ్ శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన మిషా నారంగ్ హీరోయిన్ గా నటించగా, అలీ రెజా, నందినీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. అనీష్ సోల్మన్ సంగీతం అందించాడు.