ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కి అసలు కలిసి రావటం లేదు. ఈ క్రమంలో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సీఎస్కే క్యాంప్‌లో జోష్ నింపింది డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీ. ముంబైలోని ట్రైడెంట్ హోటల్ లాన్‌లో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే, ఈ వేడుకలో సీఎస్కే ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ దేవాన్ కాన్వె త్వరలోనే.. తన ప్రేయసి కిమ్ వాట్సన్‌ని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకి వారు బస చేసిన హోటల్‌లో పార్టీ ఇచ్చారు. ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో కాన్వే సహా జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ కెప్టెన్ ధోని, మొయిన్ అలీ, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, ఉతప్ప, అంబటి రాయుడు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి సందడి చేశారు. తమిళ సంప్రదాయబద్ధమైన పట్లు పంచె, లాల్చీల్లో కొత్తగా కనిపించారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు సీఎస్కే ప్లేయర్లు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.
Devonum Deviyum! 💛
Happy Whistles for the soon-to-be's! Wishing all the best to Kim & Conway for a beautiful life forever!#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/yPJe5DBQQK— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022
ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సీఎస్‌కే యాజమాన్యం ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దీంతో చెన్నై టీం మొత్తం పంచె కట్టులో భలే ముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వేడుకకు కాన్వే ఫియాన్సి కిమ్ వాట్సన్ వర్చువల్‌గా హాజరైంది. న్యూజిలాండ్‌లో ఉన్న కిమ్ పసుపురంగు పట్టు చీరలో మెరిసిపోయింది. కాన్వే, కిమ్ ఇద్దరు వర్చువల్‌గా సంభాషించుకుంటుండగా.. సహచర సభ్యులు చప్పట్లతో ఇద్దరినీ విష్ చేశారు. అనంతరం కేక్ కట్టింగ్, ఆలింగనాలతో పార్టీ సందడి సందడిగా సాగింది. అంతేకాదు, లుంగి డాన్స్‌తో అదరగొట్టారు ప్లేయర్లు.
Maple & Machis! 📸 that go straight into the Yellove Album! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qUAKbrCpYu
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
కాగా, డెవాన్ కాన్వే-కిమ్ వాట్సన్ 2020లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్‌కే.. తమ తదుపరి మ్యాచ్‌లో తమ కంటే దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములను చవిచూడగా, ముంబై.. ఆడిన ఆరింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
📹 Colourful Kaatchis from the last night kondattam! 😎💛#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hoJWgpzEbx
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
Advertisements