మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రతీ ఏటా సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.
ఇటీవల అగ్ర నాయకులు లొంగిపోవడం, అరెస్ట్ కావడం.. ఏవోబీలో రెండుసార్లు ఎదురుకాల్పులతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గూడెం కొత్తవీధి, సీలేరు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
Advertisements
ప్రభుత్వ ఆస్తుల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మన్యంలో తిరిగే రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న పలు రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు అలర్ట్ చేశారు.