మెడికల్ ఎమెర్జెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న హేమలి అనే మహిళను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన హేమలి మెడికల్ ఎమెర్జెన్సీ పేరుతో సోషల్ మీడియాలో డబ్బులు అడగటం అలవాటు చేసుకుంది.
వాట్సప్ లో తన స్నేహితులకు మెసేజ్ లు చేసి ఆస్పత్రిలో అర్జెంట్ గా డబ్బులు కట్టాలని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రతీసారి ఇదేపనిగా అడుగుతుండటంతో అనుమానం కలిగిన గోల్కొండకి చెందిన లవ్లీన్ కుమార్ అనే వ్యక్తి గతంలో కూడా సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు లక్షల రూపాయల వరకూ మెడికల్ ఎమెర్జెన్సీ పేరుతో మోసం చేసినట్టు తెలుస్తుంది. అకౌంట్ డీటెయిల్స్ ఆధారంగా హేమలిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.