మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ పెరుగుతున్న క్రమంలో.. ప్రభుత్వం ఇప్పటికే నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయడంతో పాటు నైట్ కర్ఫ్యూ విధిస్తోంది.ఈ క్రమంలోనే షిర్డీలోని సాయిబాబా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు అధికారులు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సాయిబాబా దర్శనం ఉంటుందని షిర్డీ ఆలయబోర్డు వెల్లడించింది. అలాగే ప్రతి రోజు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా .. ఏడు నెలల విరామం తర్వాత ఇటీవలే ఆలయాన్ని తెరిచారు.