మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గోన్ జిల్లాలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఖర్గోన్ జిల్లాల్లో మే2, మే 3 తేదీల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఈద్ ప్రార్థనలను ముస్లింలు ఇండ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది.
అక్షయ తృతీయ, పరశురామ్ జయంతి సందర్భంగా జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని అధికారులు సూచించారు. గత నెల 10న శ్రీరామ నవమి సందర్భంగా రాళ్లదాడి జరగడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
దుకాణాలను తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక పాసులను జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి ఈ నిర్ణయాల్లో మార్పులు చేసే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ సుమేర్ సింగ్ చెప్పారు.