వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్‌రోడ్డులో చెత్త కుప్పలో కుప్పులు కుప్పలుగా నోట్ల కట్టలు దొరికాయి. హంటర్ రోడ్డు 12 మోరీల జంక్షన్ దగ్గర చెత్తకుప్పల్లో చిరిగిపోయిన, చెదలుపట్టిన రూ. 1.60 లక్షల విలువైన నోట్ల కట్టలను స్థానికులు గుర్తించారు. వెంటనే మట్టెవాడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నోట్లకట్టలను స్వాధీన పర్చుకున్నారు. ఇందులో రూ.200, రూ.100, రూ.500 నోట్లు ఉ న్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను చెత్తకుప్పల దగ్గర పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.