విద్యుత్ సరఫరా కావటం లేదన్న ఫిర్యాదుతో లైన్ మెన్, హెల్పర్ విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తున్నారు. స్తంభం ఎక్కే ముందే విద్యుత్ సరఫరా నిలిపేసి రావటంతో ఎలాంటి భయం లేకుండా వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ అకస్మాత్తుగా కరెంట్ సప్లై కావటంతో ఆ ఇద్దరు విద్యుత్ షాక్ తో విలవిల్లాడారు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామ పరిధిలో ఈ ఘటన నమోదైంది. లైన్ మెన్ రవికుమార్, మధుర పురం గ్రామానికి చెందిన అశోక్ విద్యుత్ పోల్ పై పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో ఆ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.