నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ బై లింగ్వెల్ మూవీ ‘కస్టడీ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి దశలో ఉంది. తాజాగా లాస్ట్ షెడ్యూల్ షూట్‌ని ప్రారంభించారు యూనిట్. దీంతో మొత్తం ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి.
ప్రధాన నటీనటులందరూ పాల్గొంటున్న ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించిన కస్టడీ గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఈ టీజర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేశాయి. టీజర్‌లో నాగచైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది.
చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.