ఆన్‌లైన్ రుణాల పేరుతో అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్న మనీ యాప్‌లపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా.. వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వారు గూగుల్ సాయాన్ని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఆ సంస్థకుకు ఓ లేఖ రాశారు.
ఆన్‌లైన్ రుణాలను ఆఫర్ చేస్తున్న మనీ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని లేఖలో కోరారు. ఫ్లిప్‌క్యాష్, క్యాష్ ఓకే, మైబ్యాంక్, లిక్విడ్ క్యాష్, ధనిబజార్, మనీమార్ట్, లోన్‌యాప్, స్నాప్ ఇట్, క్రేజీడీన్, రూపీస్ ఫ్యాక్టరీ, క్యాష్బీ, బబుల్ లోన్, బిల్లీ క్యాష్, ఉదార్‌లోన్, మామాలోన్ వంటి యాప్‌లలో ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి.. వాటిని తొలగించాలని సూచించారు. అలాగే అత్యవసరం అంటూ.. ప్రజలెవరూ మనీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని ఇబ్బందులు పాలు కావొద్దని తెలిపారు.