సైబర్ క్రిమినల్స్ కి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. లేటెస్ట్ మరో నేరానికి పాల్పడ్డారు సైబర్ కేటుగాళ్లు. ఈ సారి పోలీస్ శాఖలోని ఒక ఉన్నత వ్యక్తిని టార్గెట్ చేశారు. నగ్న వీడియో బూచి చూపించి లక్షల రూపాయలు దండుకున్నారు. ఎంత పంపించినా కూడా వారి అరాచకం రోజు రోజుకీ పెరిగిపోవడంతో.. విసిగిపోయిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మహిళ మార్ఫింగ్ వీడియోతో చర్లపల్లి జైల్ డిప్యూటి సూపరింటెండెంట్ దశరథంను ట్రాప్ చేశారు సైబర్ నేరగాళ్లు. న్యూడ్ కాల్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తూ వరుసగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లతో న్యూడ్ కాల్ లో మాట్లాడారు జైలర్ దశరథం. సైబర్ నేరగాళ్ల అరాచకం రోజు రోజుకీ పెరిగిపోవడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు దశరథం.
నగ్న వీడియోలు యూట్యూబ్ లో వైరల్ చేయ్యకుండా ఉండాలంటే సొమ్ము కట్టాలని సైబర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. సైబర్ గ్యాంగ్ డిమాండ్ మేరకు మొదట రూ.35,000 ఫోన్ చేశారు జైలర్ దశరథం. రలా వారు కాల్ చేసి బెదిరించగా రెండో విడతగా మరో రూ.65000 డిమాండ్ చేశారు. గత్యంతరం లేక రెండో సారి కూడా తన బ్యాంక్ నుండి డబ్బులు చెల్లించారు.
అయినా వదలని కేటు గాళ్ళు.. మళ్ళీమళ్ళీ ఫోన్లు చేసి రూ.85000 కావాలని డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన దశరథం ఆఖరికి కూషాయిగుడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్లపల్లి జైల్ డిప్యూటి సూపరింటెండెంట్ దశరథం తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.