బిట్ కాయిన్ చీటర్స్ ముఠా చేతిలో మోసపోయాడు మరో యువకుడు. కే-కీయున్ యాప్ డౌన్లోడ్ చేయించిన ఆ యువకుడి నుంచి 8 లక్షల సొమ్మును కొట్టేశాడు కేటుగాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…అంబర్పేట్ కు చెందిన నరేష్ ను ట్రాప్ చేసి బైనాన్స్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేసి కే-కాయిన్ యాప్ ద్వారా ట్రేడింగ్ చేయవచ్చని నమ్మించాడు కేటుగాడు.
పలు విడతలుగా మొత్తం ఎనిమిది లక్షలు పెట్టుబడిని పెట్టాడు నరేష్. ఇది సరిపోక మరింత డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేశాడు ఆ సైబర్ కేటుగాడు. అనుమానం రావడంతో బాధితుడు నరేష్ తిరిగి వారిని ప్రశ్నించటం స్టార్ట్ చేశాడు. వెంటనే నరేష్ ఫోన్ బ్లాక్ చేయడం తో పాటు యాప్ లింకు డిలీట్ చేశారు. మోసపోయానని గ్రహించిన నరేష్ సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.