సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు నిత్యం ఏదో ఒక చోట ఎక్కడో ఒకదగ్గర ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు అరకోటికి టోపీ పెట్టారు. మాదన్నపేట కి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేసి డైమండ్స్ ట్రేడింగ్ లో నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయి అంటూ ముగ్గులోకి లాగారు.
అంతే కాకుండా Idex.appfact.club యాప్ ని డౌన్లోడ్ చేయించి పెట్టుబడికి అత్యధిక లాభాలు వస్తున్నట్టు యాప్ లో చూపిస్తూ… మొత్తం 43 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత యాప్ లింక్ ను డిలీట్ చేయడంతో మోసపోయానని అబ్దుల్ గ్రహించాడు. దీనితో సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.