బోధన్ లో వెలుగు చూసిన నకిలీ పాసుపోర్టుల కుంభకోణంపై సైబరాబాద్ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారన్నారు సీపీ సజ్జనార్. ఫేక్ అడ్రస్ లతో మొత్తం 72పాస్ పోర్టులు పొందారన్నారు. అందులో 42పాస్ పోర్టులను ఏఎస్ఐ మల్లేష్ రెకమండ్ చేశాడని సీపీ ప్రకటించారు.
ప్రధాన నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన పరిమళ్ బైన్ అని గుర్తించామని… బోధన్ లో మీసేవా నిర్వాహకుడి ద్వారా ఈ పాస్ పోర్టులు పొందినట్లు గుర్తించామన్నారు. ఒక్కోక్కరి నుండి 10-30వేల వరకు తీసుకున్నారని… 25మంది ఎజెంట్లు, ఒక ఇమ్మిగ్రేషన్ అధికారిని, ముగ్గురు పోలీసు అధికారులను అరెస్ట్ చేసినట్లు తెలిపాడు.
పరిమళ్ బైన్ అక్రమంగా సముద్రమార్గంలో ఇండియాకు వచ్చాడని… కేవలం ఐదు ఫోన్ నెంబర్లతో 36 పాస్ పోర్టులు ఉన్నట్లు తేలిందన్నారు సజ్జనార్. ఈ మొత్తం వ్యవహారంలో 49మంది ఎక్కడున్నారు అన్నది తేలాల్సి ఉందన్నారు.