23 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం వారి దగ్గర నుంచి 93లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14 బెట్టింగ్ బార్డ్స్, 8 లాప్టాప్ లు, 247 మొబైల్ ఫోన్లు, 28 స్మార్ట్ ఫోన్స్, 4 టాబ్స్ ను సొంతం చేసుకున్నారు.
ముంబై, గోవా, దుబాయ్ లలో వీరి నెట్వర్క్ ఉన్నట్లు తెలుసుకున్నారు పోలీసులు. మెయిన్ బుకి, మహా, @ సురేష్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సెకండ్ లేయర్ లో చింతా వేణు ఉన్నాడు. ఇతనికి పై గతం లో కేసులు కూడా ఉన్నాయి. కాగా ఈ బెట్టింగ్ ముఠా గుట్టు బయట పెట్టిన పోలీసు అధికారులను..సైబరాబాద్ సీపీ స్టెఫెన్ రవీంద్ర అభినందించారు.