రకరకాల కారణాలతో టూ వీలర్, కార్లను అమ్మేస్తుంటాం. కానీ చాలా మంది R.C మార్చుకోరు. దీంతో చలాన్ల దగ్గర నుండి ఏ ఇబ్బంది అయినా మొదటి ఓనర్ మొబైల్ నెంబర్ కే వివరాలు వస్తుంటాయి. దీన్ని ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పైగా ఇప్పుడు ఆ చలాన్ల బాధ్యత ఎవరిది…? అన్న అనుమానం కూడా ఉంది.
ఇదే అనుమానంతో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సైబరాబాద్ పోలీసులు సమాధానం చెప్పారు. అలాంటి చలాన్ల బాధ్యత పాత ఓనర్ తో పాటు బండి కొన్న వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుందన్నారు. అయితే, ఇలాంటి చలాన్లతో పాటు ఇతరత్రా ఇబ్బందులు పడకుండా ఓ ఆప్షన్ ఇచ్చారు. ఈ చలాన్ వెబ్ సైట్లో కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఉంటుందని, దాన్ని క్లిక్ చేస్తే సోల్డ్ అవుట్ వెహికల్ అనే ఆప్షన్ ఉంటుందని తెలిపారు. అక్కడ మీ వివరాలు నమోదు చేస్తే… మేం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.