ఇటీవల కాలం లో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు లెక్కపెట్టలేనన్ని మోసాలు జరుగుట్జున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట కు చెందిన బిజినెస్ ఉమెన్ రేఖ కు చెందిన అమెరికన్ ఎక్స్ ప్రెస్ రెండు క్రెడిట్ కార్డుల నుండి ఆమెకు తెలియకుండానే ₹5.70 లక్షలు కాజేశారు కేటుగాళ్ళు.
దీనితో ఆమె సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. కాగా క్లోనింగ్ ద్వారా కేటుగాళ్లు నకిలీ కార్డులు సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.