తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ వైపు నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా.., తెల్లారేసరికి తుపానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 25న తమిళనాడు, పాండిచ్చేరి మధ్య కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చనని అంచనా వేస్తున్నారు.
తుపాను కారణంగా తమిళనాడు,పాండిచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్ల వర్షాలు కురుస్తుండగా.., రాయలసీమ జిల్లాల్లో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఉరుములు, మెరుపులతో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావం ఈ నెల వ తేదీ వరకూ కొనసాగనుంది. కాగా ఈ తుపానుకు నివర్ అనే పేరును ఇరాన్ దేశం సూచించింది.