తీరం దాటబోతున్న అంఫన్ తుపాను! - Tolivelugu

తీరం దాటబోతున్న అంఫన్ తుపాను!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అంఫన్ తుపాను మరికాసేపట్లో తీరాన్ని తాకబోతోంది . సాయంత్రం 4గంటలకు తీరాన్ని దాటే అవకాశం ఉంది. . పశ్చిమబెంగాల్‌లోని దిఘా బంగ్లాదేశ్ హతియా దీవుల తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.

మరోవైపు అతి తీవ్ర తుపానుగా మారిన ఆంఫన్ కారణంగా బెంగాల్ తీరా ప్రాంతాలు వణికిపోతున్నాయి .ఇటు పశ్చిమబెంగాల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను గురువారం సాయంత్రం దాకా మూసేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 3 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు.

ఒడిశా తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. 5 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతున్నాయి. భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. చెట్లు రోడ్లపై పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్తగా తీరప్రాంతాల్లో ఉన్న లక్షా 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 41 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఒడిశా , బెంగాల్ లో సహాయక చర్యల్లో మునిగిపోయాయి. సైన్యం, ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో ఈదురుగాలుల తాకిడికి చెట్లు నేలకొరిగాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చాలా చోట్ల వంద అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp