బెంగాల్ ను అతలాకుతలం చేస్తున్న ఆంఫాన్ తుపాన్ కు ఆ పేరు పెట్టింది థాయిల్యాండ్ ….ఆంఫాన్ అంటే థాయి భాషలో ఆకాశం అని అర్థం.
తుఫాన్లకు పేర్లు పెట్టే విధానం:
హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్ర తీరాల పరిధిలోని దేశాలైన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ లు…. 2004 లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో సమావేశమయ్యాయి. ప్రతి దేశం రాబోయే తుఫాన్ల కోసం 8 పేర్లను సూచించాయి. అంటే… 8దేశాలు * 8 పేర్లు = 64 పేర్లు సూచించాయన్నమాట.
అ జాబితా ప్రకారం … ఈ 8 దేశాలను అల్ఫాబెటికల్ అర్డర్ లో అమరుస్తారు…అంటే బంగ్లాదేశ్ ఫస్ట్ , ఇండియా సెకెండ్….ఇలా అన్నమాట…. ఆయా దేశాలిచ్చిన పేర్లను ఆర్డర్ ప్రకారం సెట్ చేస్తారు..పేర్లన్నీ అయిపోగానే మళ్లీ బంగ్లాదేశ్ నుండి స్టార్ట్ చేస్తారు. ఇచ్చిన 64 పేర్లు అయిపోతే మళ్లీ… మీటింగ్ పెట్టుకొని ఈ దేశాలన్నీ కలిసి ఇంకొన్ని కొత్తపేర్లు ప్రతిపాదిస్తాయి.
ఈ సమావేవం తర్వాత 2004 లో వచ్చిన మొదటి తుఫాన్ కు బంగ్లాదేశ్ ఇచ్చిన ఒనిల్ అనే పేరు పెట్టారు. తర్వాతి తుఫాన్ కు ఇండియా ఇచ్చిన అగ్ని అని పేరు పెట్టారు…. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.!
8 దేశాలు సూచించిన తుఫాన్ల పేర్లు:
- బంగ్లాదేశ్: ఒనిల్, ఒగ్ని, నిషా, గిరి, హెలెన్, చపల, ఓక్కీ, ఫొని
- ఇండియా: అగ్ని, ఆకాశ్, బిజిలీ, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు
- మాల్దీవులు: హిబరు, గోను, ఆలియా, కీలా, మాది, రోను, మకును, హిక్కా
- మయన్మార్: ప్యార్, యెమిన్, ప్యాన్, థానె, నానోక్, కయాంత్, దయే, కయాబ్
- ఒమన్: బాజ్, సిదర్, వార్డ్, ముర్జాన్, హుద్ హుద్, నాడా, లుబాన్, మహా
- పాకిస్తాన్: ఫనూస్, నర్గీస్, లైలా, నీలం, నీలోఫర్, వార్దా, తిత్లీ, బుల్‌బుల్
- శ్రీలంక: మాలా, రష్మి, బంధు, మహాసేన్, ప్రియా, అసిరి, గజ, సోబా
- థాయ్‌లాండ్: ముక్దా, ఖైముక్, ఫేట్, ఫైలిన్, కోమెన్, మోరా, పెథాయ్, ఆంఫాన్