హైదరాబాద్ ధూల్ పేటలో సిలిండర్ పేలింది. అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న గోదాంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మానవ సింగ్ అనే యువకుడు చనిపోగా.. అతడి తండ్రి నీరజ్ సింగ్, తల్లి సుచిత్ర సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని డీఆర్డీఎల్ అపోలో హాస్పిటల్ కి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పాక్షికంగా ధ్వంసమైంది. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు కార్పొరేటర్స్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ధూల్ పేటలో గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగి పలువురు మరణించారు.