దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2022ను ముంబైలో ఆదివారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి సైతం ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పాటు పలు విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. ఈ వేడుకల్లో పలువురు నటులు స్టైలిష్ దుస్తుల్లో మెరిసి అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగు సిని పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు మూవీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది.
చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలు – ఆశా పరేఖ్
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్- అనదర్ రౌండ్
ఉత్తమ దర్శకుడు- కెన్ ఘోష్ స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్
ఉత్తమ సినిమా కొరియాటోగ్రాఫర్ జయక్రిష్ణ గుమ్మడి హసీనా( దిల్ రూభా చిత్రానికి)
ఉత్తమ సహాయ నటుడు – సతీష్ కౌశిక్ (కాగజ్ )
ఉత్తమ సహాయ నటి – లారా దత్తా (బెల్ బాటమ్)
ఉత్తమ ప్రతినాయకుడు – ఆయుష్ శర్మ (అంతిమ్: ది ఫైనల్ ట్రూత్)
పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ – అభిమన్యు దస్సానీ
పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టరెస్ – రాథిక మదన్
ఉత్తమ చిత్రం*- షేర్ షా
ఉత్తమ నటుడు- రణవీర్ సింగ్ (83)
ఉత్తమ నటి- క్రితిసనన్ (మిమి)
బెస్ట్ డెబ్యూ – అహన్ శెట్టి
ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్- పుష్ప
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – మరో రౌండ్
ఉత్తమ వెబ్‌సిరీస్ – కాండీ
ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్) – మనోజ్ బాజ్‌పేయి
ఉత్తమ నటి (వెబ్ సిరీస్) – రవీనా టాండన్
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ
ఉత్తమ నటుడు (టెలివిజన్ సిరీస్) – షహీర్ షేక్
ఉత్తమ నటి (టెలివిజన్ సిరీస్) – శ్రద్ధా ఆర్య
మోస్ట్ ప్రామిసింగ్ నటుడు (టెలివిజన్ సిరీస్) – ధీరజ్ ధూపర్
అత్యంత ప్రామిసింగ్ నటి (టెలివిజన్ సిరీస్)- రూపాలీ గంగూలీ
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – పౌలి
ఉత్తమ నేపథ్య గాయకుడు – విశాల్ మిశ్రా
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – కనికా కపూర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జయకృష్ణ గుమ్మడి