దర్శకుడు తేజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. చిత్రం సినిమాతో దర్శకుడిగా గా పరిచయమయ్యారు తేజ. తర్వాత జయం, నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. మొదటి నుంచి కూడా యంగ్ హీరోలను పరిచయం చేయడంలో తేజ ముందుంటారు.
ఇప్పుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు, దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తో సినిమా చేస్తున్నాడు తేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.
కాగా తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు తేజ బర్త్ డే ఈరోజు సందర్భంగా ఇది రివీల్ చేశారు. ఈ సినిమాకి అహింస అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో అభి మొహానికి సగం వరకు ఒక గుడ్డ ఉండగా రక్తం కారుతూ కనిపించాడు.
ఇక ఈ ప్రీ లుక్ చూస్తుంటే తేజ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఆర్ పి పట్నాక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు.