కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా టాలీవుడ్ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తుండగా, మరికొందరు ఇండస్ట్రీలో ఉండే చిన్న, చిన్న జీతాలతో పనిచేసే వారి సంక్షేమం కోసం విరాళాలు ఇస్తున్నారు.
తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో పేదల కడుపు నింపేందుకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. హీరో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబులు కలిసి కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
వెంకటేష్ ప్రస్తుతం నారప్ప షూటింగ్ నుండి బ్రేక్ తీసుకోగా, రానా ఆరణ్య సినిమా ప్రమోషన్స్ లో ఉండగానే కరోనా వైరస్ బ్రేక్ వచ్చింది. రానా ప్రస్తుతం విరాట పర్వం సినిమాలో చేస్తున్నాడు.