మాములుగా హీరోలు, హీరోయిన్లు దర్శకులు సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కోసం తిరుగుతుంటారు. ఇంటర్వ్యూస్ ఇస్తూ మా సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుందంటూ తెగ ప్రచారం చేస్తారు. మరికొంత మంది హీరోలు తమ సినిమాని డిఫరెంట్ స్టైల్ లో ప్రమోషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదే కేటగిరిలో చేరాడు విక్టరీ వెంకటేష్.
సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలు గా వచ్చిన సినిమా వెంకీ మామ. సినిమా రిలీజ్ కు ముందు అందరి హీరోలులానే వెంకీ కూడా ప్రమోషన్ చేశాడు. అయితే మేనల్లుడితో కలిసి చేసిన సినిమా కావటంతో రిలీజ్ అయ్యాక కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాడు వెంకీ. అదే విషయంపై వెంకీ ఫాన్స్ కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుర్ర హీరోల్లా థియేటర్లలో వెంకీ రావటం, వాళ్ళతో ఫోటోలు దిగటంపై అసంతృప్తిగా ఉన్నారట.
కానీ వెంకీ మాత్రం చాలా హ్యాపీ గా ఉందని, ఇలా అందరిని కలవటం, సినిమా చూడటం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తున్నది వెంకీ. మరి కొంత మంది ఫాన్స్ మాత్రం వెంకీ ఇలా థియేటర్లో సందడి చెయ్యటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.