పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించి గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. తాజాగా దగ్గుబాటి రానా కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.
ఇందులో రానా నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట!! స్టేషన్‌లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర హీరో.. హీరో అంటూ చెప్పిన డైలాగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్‌లో ఈ టీజర్ 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. 2022 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు.