టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న దగ్గుబాటి రానా ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయితో ఉన్న ఫోటో అభిమానులతో పంచుకొని అందర్నీ ఆశ్చర్యపర్చాడు. అలా ఫోటో పెట్టి పది రోజులు గడిచిందో లేదో ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంటున్నాడు.
ఈ ఏడాదే రానా పెళ్లి ఉంటుందని సురేష్ బాబు ఇప్పటికే ప్రకటించాడు కూడా. అయితే… తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా-మిహిక బజాజ్ ల ఎంగేజ్మెంట్ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రామానాయుడు స్టూడియోస్ లో జరగనుందని తెలుస్తోంది.
దగ్గుబాటి కుటంబం, మిహికా బజాజ్ కుటంబ సభ్యులు మాత్రమే హజరవుతున్నారని… నిడారంబరంగానే కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.