టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న దగ్గుబాటి రానా ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయి మిహిక బజాజ్ తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకొని అందర్నీ ఆశ్చర్యపర్చాడు. అలా ఫోటో పెట్టిన తక్కువ సమయంలోనే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేశాడు. తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను రానా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అండ్ ఇట్స్ అఫిషియల్ అంటూ టాగ్ లైన్ కూడా ఇచ్చేశారు.
+
అయితే ఎంగేజ్మెంట్ జరగట్లేదని కొందరు అంటే లేదు ఎంగేజ్మెంట్ జరుగుతుందని జరిగిన చర్చకు రానా ఇంతటి తో తెరదించారు. అచ్చం తెలుగు సంప్రదాయం ప్రకారం పంచెకట్టుతో వైట్ అండ్ వైట్ లో రానా దిగిపోయాడు. ఇక ఈ ఏడాదే రానా పెళ్లి ఉంటుందని సురేష్ బాబు ఇప్పటికే ప్రకటించాడు కూడా.
And it’s official!! ???? pic.twitter.com/0J3jBeEaep
— Rana Daggubati (@RanaDaggubati) May 21, 2020