ఎంతోకాలంగా వేచి చూస్తున్న దగ్గుబాటి రానా పాన్ ఇండియా మూవీ విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. బాహుబలి తర్వాత కొన్ని పాన్ ఇండియా సినిమాలకు ఒకే చెప్పిన రానాకు… ఆ తర్వాత రకరకాల కారణాలతో సినిమా విడుదల, షూటింగ్‌లు ఆలస్యం అవుతూ వచ్చాయి. అందులో ఒకటి హాతి మేరే సాతి కూడా ఒకటి. ప్రభు సొలొమాన్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు, కన్నడతో పాటు హిందీ భాషల్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది.
భారీ బడ్జెట్‌తో శ్రీలంక, థాయిలాండ్, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించిన ఈ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. విరాట పర్వం సినిమా షూటింగ్‌లో రానా బిజీగా ఉన్నప్పటికీ… ఇటీవలే హాతి మేరీ సాత్ సినిమా డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రానా నటిస్తోన్న తెలుగు సినిమా విరాట పర్వం కూడా ఈ వేసవి సెలవుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.