చారిత్రాత్మక కథలతో మెప్పించే డైరెక్టర్ గుణశేఖర్. గుణశేఖర్ తాజాగా శాకుంతలం అనే పౌరాణిక సినిమా చేయబోతున్నారు. ఈ మూవీలో శకుంతల క్యారెక్టర్ లో నటించేందుకు ఇప్పటికే సమంత ఇకే చెప్పింది. దీంతో ఈ మూవీలో కీలకమైన దుష్యంతుడు ఎవరు అనే అంశంపై చర్చ సాగుతుంది.
దుష్యంతుడి పాత్రకు దగ్గుబాటి రానాను సంప్రదించగా… ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ గుణశేఖర్ తమిళ్, మలయాళ సినిమా స్టార్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నుండి పలువురిని తీసుకునే ఛాన్స్ ఉంది.