దగ్గుబాటి పురందరేశ్వరీ బీజేపి నేత. ఆమె భర్త వెంకటేశ్వర్రావు వైసీపీ నేత. అయితే… అధికారంలోకి రాగానే జగన్‌కు ఈ కాంబినేషన్ నచ్చకపోవటంతో పెట్టిన షరతుతో దగ్గుబాటి ఫ్యామిలీ బీజేపీలోనే కొనసాగుతోంది.
భార్యభర్తలిద్దరు చెరో పార్టీలో ఉండటం సమంజసం కాదు, ఎక్కడున్నా ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం మంచిది… మీరు ఓ నిర్ణయం తీసుకోండి అంటూ సీఎం జగన్ సూచించటంతో గందరగోళంలో పడ్డ దగ్గుబాటి ఫ్యామిలీ బీజేపీలోనే కొనసాగేందుకు మొగ్గుచూపింది. అయితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాల నుండి వైదొలగబోతున్నారు. పురందరేశ్వరి యాధవిధిగా కొనసాగే అవకాశం కనపడుతోండగా… ఇప్పుడు కొడుకు హితేష్ ఫ్యూచర్ ఎంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
తల్లితండ్రులను నొప్పించకుండా… తాను వైసీపీలోని కొనసాగలేనని తెలిశాక, హితేష్ కన్నీటి పర్యంతమయ్యారన్న వార్త దగ్గుబాటి అనుచరుల్లో హాట్ టాపిక్ అవుతోంది.