దేశీయ విమానయాన రంగం నెమ్మదిగా గాడిన పడుతోంది. దేశీయంగా రోజువారి ప్రయాణీకుల సంఖ్య కొవిడ్ ముందు స్థాయికి చేరుకుంది. దీనిపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖను ఆయన ప్రశంసించారు.
ఈ నెల9న దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య 4 లక్షలకు చేరింది. కరోనా ముందు స్థాయికి చేరుకోవడానికి మనం కొద్ది దూరంలో ఉన్నామంటూ పౌరవిమాన యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఈ మైలు రాయిని చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మైలు రాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఒక్క గొప్ప సంకేతమని ఆయన కొనియాడారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగు పరచడంపై మనం మరింత దృష్టి పెట్టాలని మోడీ సూచించారు.
సులభతర జీవనానికి, ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమంటూ మోడీ అన్నారు. ఈ మేరకు సిందియా ట్వీట్ ను ఆయన రీ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం తర్వాత అగస్టులో పౌర విమానయాన రంగం 4 శాతం వృద్ధిని చవి చూసింది. జూలైతో పోలిస్తే అగస్టులో విమాన ప్రయాణీకుల సంఖ్య కోటికి చేరింది.