స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. మొదటి భాగం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అలాగే ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక అంటూ విడుదలైన పాట కూడా మంచి ఆదరణను పొందింది. ఆగస్టు 13న రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డును బ్రేక్ చేస్తోంది. ఇప్పటివరకు 45 మిలియన్ ప్లస్ వ్యూస్‌ను సాధించింది. ఇకపోతే ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.