గౌతమ బుద్దుని బోధనలపై ఎక్కువ శ్రద్ధ చూపాలని ప్రజలను టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా కోరారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సోమవారం బుద్ధుని సూత్రాలను, శిష్యులను ఆయన గుర్తు చేసుకున్నారు.
అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య నిర్వహించిన సమావేశంలో ఆయన వీడియో సందేశాన్ని ఇచ్చారు. ‘నిజమైన మనశ్శాంతి కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన సూత్రాలపై ఎక్కువగా ప్రజలు శ్రద్ధ వహించాలన్నారు.
‘బుద్దుడు మనకు నాలుగు గొప్ప సత్యాలను బోధించారు. అవి నిజమైన బాధ, బాధలకు కారణం, బాధల నుంచి ఉపశమనం, బాధల నివారణకు అనుసరించాల్సిన మార్గాలకు సంబంధించినవి. ఈ సూత్రాలు బుద్ధుని బోధనల ప్రాథమిక ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది’అని అన్నారు.
బుద్ధుని ఆలోచనలు మన భూగోళాన్ని మరింత శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా, సుస్థిరంగా మార్చగలవని ప్రధాని మోడీ అన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ట్వీట్ చేశారు.