గులాబీ రాజ్యంలో కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓవైపు దళితుల్ని ఉద్దరిస్తున్నాం అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ.. ఇంకోవైపు అదే దళితులకు అన్యాయం జరుగుతోంది. ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాలు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో దళితులకు ఉన్న కొద్ది భూమిని కూడా కబ్జాదారులు లాగేసుకుంటున్నారు.
అల్వాల్ రెవెన్యూ పరిధిలోని యాప్రాల్ లో సర్వే నెంబర్ 138లో దళితులకు చెందిన రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైంది. తమ భూమిని ప్రముఖ బిల్డర్ జీకే హనుమంతరావు అనుచరులు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు.
పోలీసులు కూడా కబ్జాదారులతో కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.